సాహిత్యంలో కవిరాజు సినారె: మంత్రి నిరంజన్ రెడ్డి

213
niranjanreddy
- Advertisement -

తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాన సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సినారె 88వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సాహిత్యంలో కవిరాజు సినారె అని కొనియాడారు.

నిత్య జీవితంలో రారాజు… విశ్వంభర కావ్యంతో వారి కీర్తి విశ్వమంతా వ్యాపించిందన్నారు. గత ఏడాది రెండు రోజులు వనపర్తిలో సినారె జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని… ఈ తరానికి వారి స్ఫూర్థిని అందించడానికి సదస్సు అంశాలు సంచిక ఉండాలని ‘మన సినారె’ ప్రత్యేక సంచికను తీసుకువచ్చాం అన్నారు.

సినారె సాహిత్య సదన్ కు నేడు హైదరాబాద్ లో శంకుస్థాపన జరగడం శుభసూచకం అన్నారు. ఆగస్టు 25న సురవరం ప్రతాపరెడ్డి కాంస్య విగ్రహం ,వచ్చే ఏడాది సినారె జయంతి నాటికి సి.నారాయణరెడ్డి కాంస్య విగ్రహం వనపర్తిలో ఆవిష్కరిస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి , దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ , డాక్టర్ ఎంకె రాము , డాక్టర్ జుర్రు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -