హరితహారంలో అందరు భాగస్వామ్యం కావాలి..

291
Minister Indrakaran Reddy
- Advertisement -

కొత్త ప్రెసిడెన్సియల్ ఆర్డర్ కు (రాష్ట్రపతి ఉత్తర్వులు) అనుగుణంగా వివిధ శాఖలు తమకు సంబంధించిన Cadre Strength, పోస్టుల వర్గీకరణ వివరాలను సంబంధిత సెక్రెటరీలకు సోమవారం నాటికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల కార్యదర్శులతో కొత్త ప్రెసి డెన్సియల్ ఆర్డర్, హరిత హారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, సోమేష్ కుమార్, అధర్ సిన్హా, శాంతికుమారి, ముఖ్యకార్యదర్శులు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్, కె.రామకృష్ణారావు , శివశంకర్, వికాస్ రాజ్, శశాంక్ గోయల్, సబ్యసాచి ఘోష్ , పిసిసిఎఫ్ పి.కె.ఝా, కార్యదర్శులు జనార్ధన్ రెడ్డి, బి.వెంకటేశం, బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, అశోక్, నిరంజన్ రావు, పంచాయతీరాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి తమ హెచ్ఓడీల నుండి వచ్చిన ప్రతిపాదనలను సెక్రెటరీలు జి.ఎ.డి కి జూలై 12 నాటికి పంపాలని,జి.ఎ.డి. జూలై 15 కి అన్ని శాఖల ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. పోస్టులను జిల్లా,జోనల్,మల్టీజోనల్, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరించిన అనంతరం నూతన సర్వీసు రూల్స్ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యక్ష నియమకాల ఖాళీల భర్తికి చర్యలు చేపట్టాలన్నారు. హెచ్ఓడీ యునిట్ ఆఫీస్, స్ట్రెన్త్‌ లెవెల్‌ ఆఫీస్‌,స్పెషెల్‌ ఆఫీస్‌ల వివరాల లిస్టును జి.ఎ.డి. కి సమర్పించాలన్నారు.

Minister Indrakaran Reddy

హరితహారం, అటవీ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్పరెన్స్…

ఐదో విడత హరితహారం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని శాఖలు, జిల్లాల్లో సంసిద్దతపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీఅధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. నర్సరీల్లో మొక్కల లభ్యత, చేపట్టాల్సిన ప్లాంటేషన్ పై శాఖలు, జిల్లాల వారీగా సమీక్ష జరిగింది. అలాగే గత నాలుగు విడతల్లోనాటిన మొక్కల్లో బతికిన శాతంపై ఆరా తీశారు. మొక్కలు నాటి లెక్కలు చెప్పటం కంటే, వాటిని బతికించటంపై శ్రద్ద పెడితేనే తెలంగాణకు హరితహారం కలనెరవేరుతుందని, అందులో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు నిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి, సమాజంలోని అన్ని వర్గాలను హరితహారంలో భాగస్వామ్యం చేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని కోరారు.హరితహారంలో మరింతగా జవాబుదారీతనం పెంచేందుకు మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖల సిబ్బందిని ఇందుకోసం ప్రతిపాదించారు.

వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు, ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శలు, హార్టీకల్చర్ ఆఫీసర్లు, అటవీ అధికారులను కలిపి మొత్తం 25 వేల మంది సిబ్బందిని ఒక్కో ప్రాంతానికి హరితహారం నోడల్ ఆఫీసర్లుగా నియమించి పర్యవేక్షించనున్నారు.ఈ యేడాది నర్సరీల్లో పెంచిన మొక్కలను అధికారులు మరో సారి పరిశీలించి తగిన ఎత్తులో ఉన్న మొక్కలను మాత్రమే నాటేందుకు తరలించాలని, మిగతావాటిని వచ్చే యేడాది పెద్ద మొక్కలుగా నాటేందుకు పెంచాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. అన్ని శాఖల అధికారులు కూడా తమ శాఖ పరిధిలో నాటిన మొక్కల పెంపు బాధ్యత తీసుకోవాలని, ప్రతీ వారం తప్పనిసరిగా ఒక రోజు ఫీల్డ్ విజిట్ చేయాలని కోరారు. మొక్కలు నాటుతున్న ప్రదేశాలను తప్పని సరిగా జియో ట్యాగింగ్ చేయాలని, దానివల్ల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మాదిరిగా అన్ని గ్రామాల మధ్య కూడా రహదారి వనాలు పెంచేందుకు అన్ని జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేయమని కోరారు.

భూ రికార్డుల ప్రక్షాళనపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.రెవెన్యూ రికార్డులతో, అటవీ రికార్డులను పరిశీలించి అటవీ భూములను నోటిఫై చేసే ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, అవసరమైతే పక్క జిల్లాల నుంచి సిబ్బందికి తెప్పించి, పూర్తి చేయాలని తెలిపారు. నాగర్ కర్నూలు, ములుగు, జయశంకర్ భూపాల పల్లి, కొమరం భీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో ఇంకా 16 లక్షల ఎకరాల రికార్డులను పరిశీలించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

అటవీ హక్కుల గుర్తింపు పట్టాలపై (ఆర్ఓఎఫ్ఆర్)సమావేశంలో చర్చించారు. గత రికార్డుల ప్రకారం ఎన్ని పిటీషన్లు పరిష్కరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్నవి ఏఏ దశల్లో ఉన్నాయనేది పరిశీలించారు. 82, 075 అప్లికేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించిన జాబితాలో ఉన్నాయని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అటవీ హక్కు పట్టాలు, పోడు వ్యవసాయం సమస్యలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని, తద్వారా అడవుల లోపలా, బయట హరితహారం ద్వారా పచ్చదనం పెంచటం వీలవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్లతో హరితహారం, రెవెన్యూ అటవీ భూముల రికన్సిలేషన్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు, జలశక్తి అభియాన్ , స్వచ్ఛభారత్ మిషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్దత, 2021 జనాభా లెక్కల నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నదతకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తమ టీంలను యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాలకు పంపిందని ఈ విషయమై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కలెక్టర్లను కోరారు. మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ సన్నద్దతను పరిశీలించి సమీక్షించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. భువనగిరి, తూఫ్రాన్, రామాయంపేట్ , మెదక్ మున్సిపాలిటీలలో సన్నద్దతను పరిశీలిస్తారన్నారు.

జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మన రాష్ట్రం లో 23 జిల్లాలలో 114 బ్లాక్ లలో 51 వేల పనులను గుర్తించి చేపట్టడం జరుగుతున్నదని 75 శాతం పనులు పూర్తిఅయ్యాయని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నీటి సంరక్షణ పనులు ఉపాధి హమీ ద్వారా చేపడతున్నామని పనుల వారిగా సమీక్ష చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు డి.ఆర్.డి.ఓ అధికారులతో సమీక్షించి ఈ నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తిచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు జిల్లాలలో పర్యటిస్తారని ఈ అంశాన్ని సమన్వయం చేసుకోవాలన్నారు.స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మిగిలిన టాయిలెట్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాడానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్ కలెక్టర్లను కోరారు. IEC Campaign కు ప్రాదాన్యం ఇవ్వాలని, ప్రతి గ్రామపంచాయతీలలో స్లోగన్స్‌ వ్రాయాలన్నారు. జూలై 31 నాటికి నిర్మాణాలు అన్ని పూర్తి కావాలన్నారు.

2021 జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే 4 సర్య్కులర్లు జారీచేశామని 14 జిల్లాలలో 58 మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాలు , పట్టాణాల వివరాలు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ లో మిస్ అయ్యాయని, వీటి వివరాలు కలెక్టర్లు రెవెన్యూ సెక్రెటరికి పంపాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల వివరాలను 2011 మాస్టర్ డైరెక్టరీ, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ , రెవెన్యూ డిపార్ట్ మెంట్ లిస్ట్ , పంచాయతీ రాజ్ లిస్ట్ , మాస్టర్ డెరెక్టరీ 2011 సెన్సెస్ లతో సరి పోల్చుకొని వివరాలు పంపాలన్నారు. 589 మండలాలకు సంబంధిత విలేజ్ రిజిష్టర్లు కు గాను 167 తహసిల్దార్లు పంపారని 142 మున్సిపాలిటీలకు గాను 30 పట్టాణాల రిజిష్టర్లు పంపారని, మిగిలిన వారు వెంటనే పంపాలన్నారు.

జిల్లా కలెక్టర్లు మున్సిపల్ పట్టాణాలకు సమీపాన ఉన్న Urban Agglomerations వివరాలను వెంటనే పంపాలన్నారు. 2021 సెన్సెస్ నిర్వహణకు సంబంధించి ప్రీ టెస్ట్ ను రాష్ట్రంలో మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్ నిజామాబాద్ జిల్లాలలో ఆగష్టు 12 నుండి సెప్టెంబర్ 30 వరకు నిర్వహిస్తారని కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధర్ సిన్హా అన్నారు. వరంగల్ అర్బన్ లో వేలేరు మండలంలో 7 గ్రామాలు, మహబూబ్ నగర్ జిల్లాలో నవాబ్ పేట్ మండలంలో 4 గ్రామాలలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రీ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు.

- Advertisement -