నేడు తెలంగాణలో ట్రైబల్ 6వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత సమావేశ నిర్ణయాలపై సమీక్షించాం. పెండింగ్ పనులు ఇంకా ఏమున్నాయి, వాటిని ఎలా పూర్తి చేయాలి అనే దానిపై చర్చ జరిగింది. పోడు భూముల సమస్య నేనే తీరుస్తా.. త్వరలో ముఖ్యమంత్రి తో మాట్లాడి పోడు భూముల్లో వ్యవసాయం చేసే వాళ్లకు రైతు బంధు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
గురుకులాలు, కాలేజీలు పెంచాలని సభ్యులు కోరారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి నిర్మాణం కోసం కృష్టి చేస్తా. గిరిజన ఆవాసలకు 3ఫేస్ కరెంట్ లేదని తెలిసింది. అంతేకాదు కొన్ని గ్రామాలకు అసలు కరంటే లేకపోవడం దురదృష్ట కరం. గిరిజనుల సంక్షమం కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. గిరిజన సలహా మండలిలో సూచనలు, సలహాలపై కచ్చితంగా పూర్తయ్యేలా చూస్తామని మంత్రి తెలిపారు.
కొంతమంది జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా సీఎంతో చర్చించి మాట్లాడుతం.. గిరిజన రిజర్వేషన్ పై కేంద్రం పై ఒత్తిడి తెస్తాం..ప్రధానిని కలుస్తాం.. సింగరేణిలో బాక్ లగ్ పోస్టులు, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల విషయంలో ప్రత్యేక చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.