సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి..

30
Minister Satyavathi

ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో మాదన్న పేట వద్ద జరిగిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఆమె అందరికీ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి కోసం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో నడుద్దామన్నారు. గిరిజన జాతి అభివృద్ధి చెందండం కోసం 280 ఏండ్ల క్రితమే సంత్‌ సేవాలాల్ మార్గనిర్దేశనం చేశారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సేవాలాల్‌ జయంతిని అధికారికంగా జరుపుతున్నారని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని, ఇలాంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. నర్సంపేటలో గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేశామని వెల్లడించారు. దీనివల్ల ఇక్కడి గిరిజనులకు నాణ్యమైన విద్య, భోజనం అందుతాయని చెప్పారు.