జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన వైఎస్ షర్మిల..

19
Sharmila

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వైయస్ షర్మిల హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో వైయస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో జై తెలంగాణ, జై వైయస్సార్ అని ఆమె నినాదాలు చేశారు.

షర్మిల మాట్లాడుతూ.. రైతులు, విద్యార్థులు, పేదలకు ఉపయోగపడేలా దివంగత వైయస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో మళ్లీ రాజన్న కాలంనాటి స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామని చెప్పారు. కులమతాలకు అతీతంగా వైయస్ పాలించారని ఆమె అన్నారు.