సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు ధ‌న్య‌వాదాలు: ఎంపీ సంతోష్‌

35
mp santosh

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌ ఆ రాష్ట్ర సెక్రెటేరియ‌ట్‌లో మొక్క‌ను నాటారు. ఈ సందర్భంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న‌వంతుగా రోజుకు ఒక మొక్క నాటుతాన‌ని ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ట్విట్ట‌ర్‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు.

దేశ పౌరులుగా మ‌నంద‌రం ఒక్క నిమిషం తీవ్రంగా ఆలోచించాల్సిన విష‌యం ఏదైనా ఉన్న‌దంటే అది పర్యావరణ మార్పు గురించేన‌ని ఎంపీ సంతోష్ పేర్కొన్నారు. మొక్క‌ను నాట‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌యత్నం చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గారికి ధ‌న్య‌వాదాలు అని ఆయ‌న ట్వీట్ చేశారు.