గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలు చేసే ఇంక్యుబేషన్ సెంటర్‌ను వరంగల్ వైటీసి భవనంలో ప్రారంభించారు సత్యవతి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…అభివృద్ధి అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడం, పెన్షన్లు ఇవ్వడమే కాదు. ప్రతి కుటుంబం తమ కాళ్ల మీద తాము నిలబడుతూ మరో పదిమందికి ఉపాధి కల్పించేలా ఎదగేలా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులను నేడు సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని చెప్పారు. ఎన్నడూ కలలో కూడా ఊహించనిది సీఎం…నిజం చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి లక్ష్య సాధనలో భాగంగా నేడు గిరిజన సంక్షేమ శాఖ చాలా చురుకుగా పనిచేస్తుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖలోని పథకాలు లబ్ధిదారులకు సమర్థవంతంగా అందజేసేందుకు ఈ శాఖ ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చామన్నారు.
గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలు చేసేందకు వి-హబ్ ద్వారా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు.