జగన్‌…ఏడు కొండలను అమ్మేస్తాడు!

38
Ram Mohan

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే జగన్…ఏడు కొండలను అమ్మేస్తాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

జగన్ మూడు రాజధానుల పేరిట విశాఖలో ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం ఏనాడు కేంద్రానికి లేఖలు రాయని సీఎం జగన్.. ఓట్ల కోసం తిరుపతి అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రశ్నిస్తే మోడీ. జగన్ ను జైల్లో పెడతారని ఎంపీలు భయపడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని 22 మంది ఎంపీలను గెలుచుకున్న జగన్.. ఆయన పాద సేవ చేసుకోవడానికి మరో ఎంపీని గెలిపించాలని కోరుతున్నారని విమర్శించారు.