కరోనా నుండి కోలుకున్న మంత్రి పువ్వాడ..

38
Minister Puvvada

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అజయ్ కుమార్ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా జయించారు. ఈనెల 14వ తేదీన జరిపిన కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని అని ఈ విషయాన్నీ తానే స్వయంగా సోషల్ మీడియా, ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే కరోనా వైరస్ బారినపడ్డనాటి నుండి హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు పూర్తిగా హోం ఐసోలాషన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డాక్టర్ల సలహాలు, సూచనలను క్రమం తప్పకుండా చికిత్సను పాటించిన మంత్రి పువ్వాడ. కరోనా సోకిందన్న విషయం తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి రోజు ప్రార్థించారు.

తాజాగా శనివారం జరిపిన కోవిడ్ టెస్ట్(RTPCR)లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా నెగటివ్ అని తేలడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని జయించాడానికి నాకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని పేర్కొన్నారు. నా మీద మీకు ఉన్న ప్రేమ, అభిమానమే నన్ను మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. పూర్తిగా కోలుకున్నానని, సోమవారం నుండి తిరిగి విధులకు హాజరుకనున్నాట్లు ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు.