రైతులకు నష్టం చేసే కేంద్ర బిల్లులను వ్యతిరేకిద్దాం..

154
errabelli
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలోని అనభివృద్ధికి పాతర వేస్తూ, అభివృద్ధి జాతర చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సమగ్ర అభివృద్ధికి పాటు పడుతూ, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెస్తూ, వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ ఒక్క శనివారం రోజే ఒక్క తొర్రూరు మండలంలోనే మంత్రి ఎర్రబెల్లి రూ.2.32కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు.

తొర్రూరు మండ‌లంలోని నాంచారి మడూరులో రూ.22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక‌ను ప్రారంభించారు. పెద్ద మంగ్యా తండాలో రూ.12 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించిన మంత్రి. ఇదే తండాలో రూ.20ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకు స్థాప‌న చేశారు. కొమ్మ‌న ప‌ల్లి తండాలో రూ.20ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకు స్థాప‌న చేశారు మంత్రి. అనంత‌రం రూ.22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక‌ను ప్రారంభించారు.

అలాగే అమ్మాపురంలో రూ.16 ల‌క్ష‌ల వ్య‌యంతో చేప‌ట్టిన ప్రాథ‌మిక ఆరోగ్య ఉప‌ కేంద్ర భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకుస్థాప‌న చేసిన మంత్రి ఎర్రబెల్లి. ఇదే గ్రామంలో రూ.22 ల‌క్ష‌ల‌తో పూర్తి చేసిన రైతు వేదిక‌ను ప్రారంభించారు. అనంత‌రం తొర్రూరు మండ‌ల కేంద్రంలో రూ.22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక‌కు ప్రారంభోత్స‌వం చేశారు మంత్రి ద‌యాక‌ర్ రావు. అనంత‌రం తొర్రూరు మండ‌లం కంఠాయ‌పాలెంలో రూ.22ల‌క్ష‌ల‌తో నిర్మాణం పూర్తి చేసిన రైతు వేదిక‌ను, రూ.12 ల‌క్ష‌ల‌తో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. అలాగే సోమార‌పు కుంట తండాలో రూ.20ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకు స్థాప‌న చేసిన మంత్రి. ఇదే మండ‌లం మాటేడు గ్రామంలో రూ.22 ల‌క్ష‌ల‌తో పూర్తి చేసిన రైతు వేదిక‌ను ప్రారంభించారు.

ఈ సంధర్భంగా ఆయా కార్యక్రమాల్లో వేర్వేరుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడడు. ఈ విషయం బాగా తెలిసిన సీఎం కేసీఆర్, రాష్ట్రాన్ని రైతు సంక్షేమ, అభివృద్ధి రాజ్యం చేయాలని తలపెట్టారు. బంగారు తెలంగాణలో భాగంగా తెలంగాణ మగానాన్ని, కోటిన్నర ఎకరాల సస్యశ్యామలంగా మార్చారు. రాష్ట్రం సుఖ శాంతులతో, సుభిక్షంగా ఉండాలని చూస్తున్నారు. స్వర్ణ యుగం రావాలని సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు మేలు జరుగుతున్నది.

24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం, కాళేశ్వరం, దేవాదుల, ఎస్పార్‌ఎస్పీ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు, చెరువులకు నీరు వస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరుగింది. పంటల పెట్టుబడులు ఎవరైనా ఇచ్చారా? రైతులకు బీమా చేశారా? రైతు చనిపోతే అతని కుటుంబానికి రూ.5 లక్షలు ఎవరైనా ఇచ్చారా? రుణాలు మాఫీ చేశారా? నీటి తీరువా రద్దు చేశారా? చివరకు రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం దేశంలో ఎక్కడైనా చూశారా? అంటూ రైతులను అడిగారు. ఇదంతా సీఎం కేసీఆర్ కేవలం మన రాష్ట్ర రైతాంగం కోసమే చేస్తున్నారు. ఇప్పుడు రైతులను సంఘటితం చేయడానికి రైతు వేదికలు, రైతు కల్లాలు ఇస్తున్నారు. దాదాపు 20కి పైగా పథకాలు ఒక్క రైతుల కోసం అమలు అవుతున్నాయి. అని మంత్రి వివరించారు.

పల్లె ప్రగతి ద్వారా ఊరూరా నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు నిర్మితమవుతున్నది మన రాష్ట్రంలోనే. మన పల్లెల్లోనే. నిరంతర పారిశుద్ధ్యం కూడా మన దగ్గరే జరుగుతున్నది. ఈ కారణంగానే మనం కరోనా ని దాదాపు జయించాం. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించగలిగాం అన్నారు. స్వచ్ఛ భారత్ లో, సాగు నీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, రైతు పథకాల్లో అన్నింటిలో దేశంలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే, కేంద్రంలో అదే వ్యవసాయాన్ని దండుగ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మనం తిప్పి కొట్టాలి. అని మంత్రి ఎర్రబెల్లి రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతులకు శాపంగా పరిణమించింది. విద్యుత్ ప్రైవేటు పరం చేస్తార ట.

మన భూములు కార్పొరేట్లు గుత్తకు తీసుకుని పంటలు పండించి, మన రైతుల్ని కూలీ లను చేసేందుకు కుట్ర జరుగుతున్నది. ఇక మనం తినే కూరగాయలను, నిత్యావసర సరుకులను మనం పండించిన ప్పటికీ, వాటి ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి వస్తున్నది. అందుకే సీఎం కేసీఆర్, ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అధనంగా 3 టీఎంసీల నీటిని తీసుకోవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం వెంటనే, ఆ ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. అని మంత్రి రైతులకు చెప్పారు. రైతాంగాన్ని సంఘటిత పరచడానికి వీలుగా సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. 22 లక్షల రూపాయలతో ఒక్కో వేదికను, రాష్ట్రంలో రూ.572 కోట్లతో మొత్తం 2601 రైతు వేదికలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 334, మహబూబాబాద్ జిల్లాలో 82, పాలకుర్తి నియోజకవర్గంలో 29, తొర్రూరు లో 6 రైతు వేదికలు ఏర్పాటు అవుతున్నాయి. అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 12,738 వైకుంఠ థామాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1205, మహబూబాబాద్ జిల్లాలో 382, పాలకుర్తి నియోజకవర్గంలో 174, తొర్రూరు లో 29 ఏర్పాటు అవుతున్నాయి. అని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 188 గ్రామ పంచాయతీ భవనాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44, మహబూబాబాద్ జిల్లా లో 10, పాలకుర్తి నియోజకవర్గంలో 13, తొర్రూరులో 3 ఏర్పాటు అవుతున్నాయి. అని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా లో 74, పాలకుర్తి నియోజకవర్గంలో 17, తొర్రూరు లో 4 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయి అని మంత్రి వివరించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -