తిరుమల వెంకన్న సేవలో మంత్రి ఐకే రెడ్డి..

31
Indrakaran Reddy

వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన తిరుమల శ్రీ వారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.. ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ఆల‌య అధికారులు స్వాగతం ప‌లికారు.దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.