ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

144
minister puvada
- Advertisement -

శుక్రవారం ఖమ్మం నగరంలో 400 మందికి ఇళ్ల పట్టాలు అందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో శివాయిగూడెం కాలనీలో ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థలంలో ఇల్లు నిర్మించు కోకుండా ఉన్న ఖాళీ స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేసి లబ్ధిదారులను గందరగోళానికి సృష్టించిన విషయాన్ని మహిళలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకొని వచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్‌ను మరల సర్వే చేసి లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ వారు లబ్దిదారుల అందరి వివరాలు సేకరించి రీ సర్వే చేసి మొదటి విడత 400 మందికి నేడు ఇళ్ల పట్టాలు అందించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చి స్ధలం ఏర్పాటు చేయకపోవడంతో నిరు పేద లబ్ధిదారులకు న్యాయం జరగాలని తాను శివాయి గూడెం వద్ద పువ్వాడ ఉదయ్ నగర్‌లో పట్టాలు అందించిన అతి తక్కువ కాలంలోనే నివాసం ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించి ఇచ్చానని, ఇప్పుడు పువ్వాడ ఉదయ నగర్ వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటుతో అన్ని వసతులతో అద్భుతంగా ఉందని తెలిపారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటే రానున్న రోజుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి మీరు నివాసముంటున్న ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.

ఇళ్ల పట్టాలను నిపక్షపతంగా ఇచ్చామని ఇందులో పైరవి కారులు ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తేవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రెండో విడతలో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించని వారికి కూడా స్థలం చూపించి సమస్యలు పరిష్కరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారు.

- Advertisement -