- Advertisement -
ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకర్గంలోని పలువురు వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంత్రి సిఫారసు మేరకు 48 మందికి రూ.19.33 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంలాంటిదని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ అనారోగ్య కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్న భరోసానందిస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు రూ.4.57 కోట్ల విలువైన చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు.
- Advertisement -