హీరో ధనుష్‌కు నవీన్ చంద్ర గ్రీన్ ఛాలెంజ్..

161
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీ హీరో నవీన్ చంద్ర తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ నటుడు రాజా రవీంద్ర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు సినీ హీరో నవీన్ చంద్ర. అనంతరం మరో నలుగురు ( తమిళ హీరో ధనుష్, రాహుల్ రవీంద్రన్, సలోని లూథర, చాందిని చౌదరి )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.

Green India Challenge
- Advertisement -