ఉపాధి కల్పన కోసం ఖమ్మం ఐటీ హబ్‌: పువ్వాడ

180
puvvada
- Advertisement -

ఖమ్మం యువత ఉపాధి కల్పన కోసం ఐటీ హబ్ నిర్మించామని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌. ఖమ్మం ఐటీ హబ్ పనులను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , కలెక్టర్ ఆర్.వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు పువ్వాడ అజయ్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన….శంకుస్థాపన రోజే పది కంపెనీలతో ఎంవోయూ చేశాయి..ఫేస్-2 కార్యక్రమాన్ని కేటీఆర్ చేతుల మీద మొదలుపెడతాం అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ టాస్క్ సెంటర్ ఉంటుంది.యువతకు నిత్యం శిక్షణ కల్పించి, స్కిల్స్ పెంచి అన్ని రంగాల్లో తీర్చిదిద్దుదాం అన్నారు.

470 సీట్లు ఏర్పాటుకు అవకాశం ఉంది…16 కంపెనీలు ఖమ్మం ఐటీ హబ్ లో పని చెయ్యబోతున్నాయి…ఖమ్మం యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపం అన్నారు. కేటీఆర్ సహకారంతో బాలారిష్టాలు తట్టుకుని ఐటీ హబ్ నిర్మించాం….2వ ఫేజ్ మాత్రమే కాదు సాధ్యమైన కంపెనీలను తీసుకొస్తం అన్నారు.

వందలు కాదు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని మా సంకల్పం …ఖమ్మం నా నియోజకవర్గం మాత్రమే కాదు.. నా కుటుంబం కూడా అన్నారు.బీజేపీ నేతలు ఫ్రస్టేషన్‌తో తనపై దాడికి ప్రయత్నించారని మంత్రిగా ఉండి డబ్బులు పంచడానికి నేను ఎర్రి పువ్వు పార్టీ లో నేను లేను ..దుబ్బాక ఛీప్ ట్రిక్స్ హైదరాబాద్ లో ప్రయోగించాలన్న బీజేపీ ప్రయత్నం వికటించిందన్నారు.నన్ను చంపాలని కుట్రతో దాడి చేశారు..చెడగొట్టడం ఈజీ కానీ కానీ ఓపికగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు.

- Advertisement -