పల్లె,పట్టణ ప్రగతికి ప్రణాళిక బద్దంగా కృషి చేయాలి- మంత్రి

74
Minister Puvvada
- Advertisement -

జూన్ 3వ తేదీ నుండి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, జయశంకర్ బడి బాట కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో సమష్టిగా, కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుదవారం NSP క్యాంపులోని DPRC భవన్ లో పల్లె, పట్టణ ప్రగతి, బడి బాట కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ VP గౌతమ్ అధ్వర్యంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశానుసారం పల్లె, పట్టణ ప్రగతితో పాటు జయశంకర్ బడి బాట కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా కష్టపడటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో పతకాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నుండి రాష్ట్ర ప్రభుత్వం అన్నిప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం తరగతుల నిర్వహణ పటిష్ట పరచాలని అదేశించారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు పక్కాగా ఉండేలా చూడాలని, స్ధానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

ప్రమాదకరంగా ఉన్న భావనలు గుర్తించి వాటిని తొలగించాలన్నారు. పాఠశాల అవరణంలో మొక్కలు, త్రాగునీరు, టాయిలెట్స్ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ ఔట్స్ ను గుర్తించి బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి విద్య అందించడం మన ప్రాధమిక బాధ్యత కాబట్టి దిన్ని విస్మరించరాదు అని, మీ వంతు కృషి చేయాలని కోరారు. చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటె ఈ విడత పల్లే, పట్టణ కార్యక్రమాల్లో చేసుకోవాలని వివారించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, చిత్తశుద్ధితో అందరూ విజయవంతం చేయలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందని అందుకు తగినట్టుగా ప్రగతి మరింత మెరుగు పెడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని, ఇందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పూర్తిగా సద్వినయోగం చేసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ ప్రగతిలో ప్రధాన సమస్య విద్యుత్ స్తంభాలు మార్పు, లూస్ విద్యుత్ తీగలు, తాగునీటి లికేజ్ లు, వర్షాకాలంలో ముంపునకు గురి కాకుండా నాలాల పూడికతీత కొనసాగురున్నదని, ఎప్పటికపుడు వరద నీరు వెళ్లే విధంగా కఛ్చా నాలాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తుల మేరకు విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ పైపుల లికేజ్ లు వెంటనే సరి చేయాలని మంత్రి అదేశించారు. దీనితో పాటు కార్పోరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ప్రతి డివిజన్, వార్డులో ఒక క్రీడాప్రాంగణంలు, మండలంకు రెండు క్రీడా ప్రాంగణాలు ఉండేలా చూడాలన్నారు. ప్లాంటేషన్, లే ఆవుట్స్ అన్యాక్రాంతం కాకుండా ఆయా స్థలాలను వినియోగించుకోవాలన్నారు.

పల్లే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంకీ ఫుడ్ కొట్స్, అందుబాటులొకి తేవాలని సూచించారు. పల్లెలతో పాటు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. గడచిన 4విడతల పట్టణ ప్రగతిలో భాగంగా అనేక పనులు అద్భుతంగా చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగా వైకుంఠధామం, సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. పల్లేప్రగతిలో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో వైకుంఠధామం, నర్సరీ, ట్రాక్టర్, నీటి ట్యాంకర్ ను ప్రతి గ్రామానికి సమకూర్చుకోవడం జరిగిందన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణ వల్ల సిజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయని గణాంకాలు తెలువుతున్నాయని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు.

ఉపాధి హామి, ఇతర పథకాలలో దేశంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలబడిందని, ఇది ముఖ్యమంత్రి విజన్ వల్ల సాధ్యం అయ్యిందని అన్నారు. పల్లే, పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ప్రతి పని పూర్తి చేసుకోవాలని, ఏక్కడ ఎవరు నిర్లక్ష్యం చూపకుండా విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, అదనపు కలెక్టర్ లు స్నేహా లత, మధుసుధన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -