బాలకార్మిక నిర్మూలనకు తోడ్పడాలి- మంత్రి

30
Minister Puvvada
- Advertisement -

రాష్ట్రంలో బాలకార్మిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రి అజయ్ తన సందేశంలో, తమ పిల్లలను పనికి పంపబోమని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

చిన్నతనంలో పిల్లలను పనికి పంపడం వారి బాల్యాన్ని, భవిష్యత్తును దోచుకున్నట్లేనని 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోబోమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. బాలల స్వేచ్ఛను హరించి బాల కార్మికులుగా మార్చడం తీవ్రమైన సామాజిక నేరమని, దీనిని ఖండించాలని పేర్కొన్నారు.

బాల కార్మిక నిర్మూలనకు సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచిత యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, బడిబాట, మన ఊరు-మన బడి, గురుకులాల అభివృధ్ది వంటి పథకాలను కార్యక్రమాలు చేస్తోందని మంత్రి తెలిపారు.

ప్రతి బిడ్డకు అపారమైన సామర్థ్యం ఉంటుందని ఇది విద్య ద్వారా ఉపయోగించబడాలని అలాగే వారికి నిరాకరించకూడదన్నారు. ప్రతి బిడ్డకు భద్రత, విద్య మరియు మెరుగైన భవిష్యత్తు హక్కు కల్పించాలని ఆయన అన్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను ప్రమాదకర పరిశ్రమల్లో నియమించరాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -