టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కేటీఆర్ సూచనల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత సారి కంటే ఎక్కువ చేయించాలన్నారు. ఆ దిశగా నమోదు ప్రక్రియను పూర్తిచేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా కృషి చేయాలన్నారు.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పువ్వాడ…. సేకరించిన సభ్యత్వాలను ఆన్‌లైన్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. పార్టీ నాయకులంతా క్రియాశీలక సభ్యత్వాలు పొందాలని, సేకరించిన సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు రెండింటినీ ఆన్లైన్ చేసి పార్టీకి సమర్పిస్తామన్నారు.
గత సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందుందని ఈ సారి మరింతగా పటిష్ట ప్రణాళికతో లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. నియోజకవర్గాల్లో నాయకులతో పాటు గ్రామ పార్టీ శాఖ, అనుబంధ కమిటీలు, మండల కమిటీలను సంసిద్ధం చేయాలన్నారు.