హరితహారం..ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి పువ్వాడ

146
puvvada
- Advertisement -

హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. హరిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.

ఖమ్మం పట్టణం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ…హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మొక్కల నాటింపుతోనే సాధ్యమని పేర్కొన్నారు.

పట్టణాలు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, పొలాల గట్లపై విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -