ఖమ్మం పట్టణ ప్రగతి లో మంత్రి పువ్వాడ..

58
puvvada ajay kumar
- Advertisement -

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పలు పనులను ప్రారంభించడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. 55వ డివిజన్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరి ప్రధాన కాల్వ పూడిక పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్రారంభించారు. అంతేకాకుండా డివిజన్లో మొక్కలు కూడ నాటారు. 6వ డివిజన్ ఖానాపురం ప్రధాన రహదారిపై గల వాల్ పెయింటింగ్, డివైడర్ పెయింటింగ్ పనులను ప్రారంభించారు, దీనితోపాటుగా ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. డివైడర్ కు స్వయంగా మంత్రి పువ్వాడ,మేయర్ నీరజ తో కలిసి రంగులు వేశారు.

అనంతరం డివిజన్‌లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ విద్యుత్,తాగునీరు,మురుగు నీరు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలను పరిశీలించి మురుగు చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయాలని సంబందిత అధికారులను అదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడలకు,ప్రభుత్వ స్థలాల గోడలకు రంగులు వేశారాయన.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ ,మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి,సుడా చైర్మన్ విజయ్, అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి, విద్యుత్ డీఈ రమేష్,పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, కార్పొరేటర్లు దోరెపల్లి శ్వేత ,డీఈ రంగారావు,మోతారపు శ్రావణి, నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -