- Advertisement -
కరోనాతో అన్నిరంగాల్లో సంక్షోభవం నెలకొందని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో వెబ్ పోర్టల్ని ప్రారంభించారు నిరంజన్ రెడ్డి. అగ్రోస్ సహకారంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లకు సేంద్రీయ మామిడిపండ్లు అందిస్తున్న www.cropmandi.com.
కరోనా సంక్షోభ సమయంలో రైతుల ఉత్పత్తులు వినియోగదారులకు చేరుస్తున్నందుకు పోర్టల్ నిర్వాహకులు లగ్గాని శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి అందరం బాసటగా నిలవాల్సిన సమయమిదన్నారు.
మామిడి, బత్తాయి తదితర పంటలను వినియోగదారుల ఇంటికే తరలించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు వాటి సహకారంతో అనేక ఇతర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు.
కరోనా విపత్కర పరిస్థితులలో ఈ విధంగా అందరూ ముందుకు వచ్చి రైతులకు తోడ్పాటునివ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
- Advertisement -