రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు..

482
minister sathyavathi rathod
- Advertisement -

లోక్ డౌన్ వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. హన్మకొండలోని నందన గార్డెన్ లో గ్రేటర్ వరంగల్ పరిధిలో త్రాగు నీటి సరఫరా, కోవిడ్ 19, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్….జిల్లాలో కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వారందరు కొలుకున్నారని చెప్పారు. కరోన వ్యాప్తిని కట్టడి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల నిమిషాల పాటు పరిసరాలను పరిశుభ్రపరుచుకోవాలన్నారు. వైరల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, మేయర్ గుండా ప్రకాష్,జడ్పీఛైర్మన్ సుదీర్ కుమార్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి,కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -