సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి….ఈ విషయంలో రైతులను చైతన్యం చేసేందుకు ప్రణాళిక చేపట్టాలన్నారు. శాస్త్రీయ పద్దతిలోనే రైతులు ఎరువులను వినియోగించాలి… వచ్చే ఏడాదికి పచ్చిరొట్ట పంట విత్తనాలను పెద్దమొత్తంలో సేకరించి అందుబాటులో ఉంచాలన్నారు.
రైతుబజార్లలో మిగిలే జీవ వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించాలి… యాసంగికి సంబంధించి అక్టోబరు కోటా ఈ నెలాఖరు వరకు అంతా షెడ్యూల్ ప్రకారం సకాలంలో డ్రా చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖలో అన్నిస్థాయిలలో పదోన్నతులు చేపట్టేందుకు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీకి సంబంధించి ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలను కూడా సంప్రదించి సూచనలు తీసుకోవాలి….. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి .. దీనిపై జిల్లా కలెక్టర్లను సంప్రదించాలన్నారు. మొక్కజొన్న సేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేయాలి…… డిసెంబరులో కందుల సేకరణకు కార్యాచరణ చేపట్టండన్నారు. పంట కొనుగోళ్లకు అవసరమయ్యే గోనెసంచులు అంచనాలకు అనుగుణంగా యుద్దప్రాతిపదికన సేకరించి అందుబాటులో ఉంచాలి న్నారు.
ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లిగడ్డల అమ్మకాలను కొనసాగించండి….. ఉద్యాన శాఖ యాసంగిలో ఉల్లి పంట సాగు ప్రాంతాలు, ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలన్నారు. ఉల్లి ధర పెరుగుదలకు కారణాలను పరిశీలించి ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలో పరిశీలించాలిన్నారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఉల్లి, టమాట ధరలు, సాగు విస్తీర్ణం స్థిరీకరణ కొరకు ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు.
మంత్రుల నివాస సముదాయంలో జరిగిన వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు, విత్తన, మార్క్ ఫెడ్, వేర్ హౌజింగ్, అగ్రోస్ సంస్థల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.