టి-సాట్ నెట్ వర్క్ ఛానళ్ల యాప్ @ వన్ మిలియన్

172
ktr
- Advertisement -

టి.సాట్-సాఫ్ట్ నెట్ టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే అనేక అద్భుతాలు సృష్టించిన టి-సాట్ మరో అద్భుతానికి వేదికైంది. టి-సాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్ ) డౌన్ లోడ్ లు కావడంతో సంబంధిత శాఖ మంత్రి కె.టి.రామారావు అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు.

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల యాప్ పది లక్షల డౌన్ లోడ్ లు కావడంతో బుధవారం ఐటి, మున్సిపల్ శాఖా మాత్యులు కె.టి.రామారావు ను తన క్యాంపు కార్యాలయంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ అధికారులతో కలిసి మొబైల్ ను ప్రదర్శిస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కష్ట కాలంలో టి-సాట్ యాప్ ఎంతగానే ఉపయోగపడిందని, కోవిడ్-19 ప్రభావంలో విద్యా శాఖకు ప్రత్యాన్మాయ మార్గంగా టి-సాట్ నెట్వర్క్ ఏర్పడిందన్నారు.

డిజిటలైజషన్ విద్యను మారు మూల ప్రాంత ప్రజలకు, పేద విద్యార్థులకు అందించడంలో టి-సాట్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఒక విద్యా శాఖకే టి-సాట్ సేవలు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ వేదికగా నిలిచిందన్నారు. వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, సాంఘిక గురుకుల సంక్షేమ శాఖల వంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు టి-సాట్ ప్రధాన వేదికగా నిలిచిందని మంత్రి కొనియాడారు. భవిష్యత్ లో టి-సాట్ సేవలు మరింతగా విస్తరించే విధంగా కొత్త ఆవిష్కరణలు చేయాలని అధికారులకు సూచించారు.

ఇక నుండి సన్ డైరెక్ట్ లోనూ….టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇక నుండి సన్ డైరెక్ట్ డీటీహెచ్ లోనూ ప్రసారాలు మొదలయ్యాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ లో విద్య-195, నిపుణ-196 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఏయిర్ టెల్ డీటీహెచ్ లో విద్య-948, నిపుణ-949, టాటా స్కై విద్య-1479, నిపుణ-1480 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని సీఈవో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 43 కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ల ద్వార, టి-సాట్ డీటీహెచ్ ద్వార ప్రసారాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

- Advertisement -