కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం: నిరంజన్ రెడ్డి

161
niranjan reddy
- Advertisement -

కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాల నుండి కరంటు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం అన్నారు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. మంత్రుల నివాస సముదాయంలో జరిగిన అగ్రోస్ బోర్డు సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి , ఆగ్రోస్ ఎండీ రాములుతో కలిసి హాజరయ్యారు నిరంజన్ రెడ్డి.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన మహీంద్రా కంపెనీ సహకారంతో ఇప్పటికే ఏపీలో జరుగుతున్న కరంటు ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి అధ్యయనం చేస్తాం అన్నారు. మధ్యప్రదేశ్, ఇండోర్, ఏపీలో తిరుపతి, ఆదోని, పిడుగురాళ్లలో ఉన్న యూనిట్లను కమిటీ సందర్శించాలన్నారు. కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఆధునిక వ్యవసాయం వైపు రైతులకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. సాంప్రదాయ వ్యవసాయంతో రైతులు నష్టపోతున్నారని తెలిపిన నిరంజన్ రెడ్డి… వారికి వ్యవసాయ శాఖ నుండి సాంకేతిక సలహాలు అందించాలన్నారు. రైతువేదికలు రైతుల అభ్యున్నతికి పాటుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేసీఆర్ ప్రోత్సాహం ఇస్తున్నది అందుకేనని.. రైతులు ఎవరి ముందూ చేయిచాచకుండా తమ కాళ్ల మీద తము నిలబడాలన్నారు.

- Advertisement -