మెడికల్ కాలేజీలకు త్వరలో శంకుస్థాపన: నిరంజన్ రెడ్డి

176
niranjan reddy
- Advertisement -

నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీల‌కు త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ శంకుస్థాప‌న చేస్తార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. గద్వాల నర్సింగ్ కళాశాలకు కేటీఆర్, వనపర్తి , నాగర్‌క‌ర్నూల్ జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీల‌కు శంకుస్థాప‌న ఏర్పాట్లు, అకాల వ‌ర్షాల‌పై నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో మంత్రి నిరంజ‌న్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

గ్రామాలలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అలాంటి కుటుంబాల‌ను అప్రమత్తం చేయాలన్నారు. హరితహారం కింద మిగిలిపోయిన చోట్ల (గ్యాప్ ఫిల్లింగ్) వెంటనే మొక్కలు నాటాలి.. అక్టోబరు నెలతో చలికాలం మొదలయితే మొక్కలు ఎదగవు అని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ నిధులను పాఠశాలల్లో మౌలిక‌ సదుపాయాల కల్పనకే వినియోగించాలన్నారు.

- Advertisement -