మా ఎన్నికలు..విష్ణు ప్యానల్‌లో బాబు మోహన్‌!

145
vishnu

అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రకాశ్‌ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించి బరిలో దూసుకుపోతున్నారు. ఇక మరోవైపు తాను అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన మంచు విష్ణు చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే విష్ణుకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మద్దతు ప్రకటించగా తాజాగా సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా చేరారు. విష్ణు ప్యానల్ నుండి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్ బరిలో ఉండనున్నట్లు సమాచారం.

ఇటీవల సినీ కళాకారులకు సన్మానం చేశారు విష్ణు. ఈ సందర్భంగా తనకు మద్దతివ్వాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరి మద్దతు కూడగడుతు ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది.