జామాయిల్ రైతులను ఆదుకుంటాం: నిరంజన్ రెడ్డి

230
niran
- Advertisement -

పెట్టిన పెట్టుబడి రాక జామాయిల్ రైతులు నష్టపోతున్నారని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో ఐటీసీ పేపర్ బోర్డ్ సందర్శించారు మంత్రి సింగిరెడ్జి నిరంజన్ రెడ్డి. యూనిట్ హెడ్ & వైస్ ప్రెసిడెంట్ ఎస్.మొహంతి, జనరల్ మేనేజర్ హరి నారాయణన్ లతో సమావేశమై సుబాబుల్ , జామాయిల్ రైతుల సమస్యలు చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. 400 కిలోమీటర్ల దూరం అలంపూర్, గద్వాల నుండి భద్రాచలానికి తమ పంటను తీసుకువస్తున్నారు.. ఇక్కడ రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదన్నారు. సుబాబుల్ , జామాయిల్ సాగు చేస్తే కనీస ధర ఇస్తామంటే రైతులు సాగుచేస్తారు…. పేపర్ పరిశ్రమ అవసరం కోసం ప్రారంభంలో రైతులను సుబాబుల్, జామాయిల్ సాగు వైపు ప్రోత్సహించారని తెలిపారు.రైతులు సాగు చేయడం అలవాటు చేసుకున్నాక వారిని విస్మరిస్తున్నారు

…ఐటీసీ నుండి మద్దతు ధర విషయంలో రైతులకు భరోసా కావాలన్నారు. సుబాబుల్ రైతులతో ఓ సమావేశం పెట్టండి .. వారి సమస్యలు వినండి, పరిష్కరించండి… కంపెనీని నమ్ముకుని సుబాబుల్ సాగుచేసిన రైతన్నకు కనీస మద్దతుధర దక్కేలా చూడండి… ప్రభుత్వం నుండి అవసరమైన సహకారం అందిస్తాం అని తెలిపారు నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఐటీసీ పరిపాలనా అధికారి చెంగల్రావు పాల్గొన్నారు.

- Advertisement -