తూకాల వద్ద రైతులకు నష్టం రాకుండా చర్యలు: నిరంజన్ రెడ్డి

101
Minister niranjan reddy
- Advertisement -

అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రుల నివాస సముదాయం నుండి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మంత్రి. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇప్పటివరకు 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని… సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయ్యాలన్నారు. తూకాల వద్ద పకడ్భంధీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నారు. నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలి న్నారు.

వ్యవసాయం ఉన్నన్ని రోజులు రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుందని… రాష్ట్రంలోని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. దీనిమూలంగా రైతుల ఇతర సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయన్నారు.

రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలుకేంద్రాలకు తెచ్చుకోవాలని… ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించాలి .. ప్రజాప్రతినిధులు నిబంధనలు రైతులకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. డీఆర్డీఎ, మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పౌరసరఫరాల శాఖ కొనుగోళ్ల విషయంలో సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలలో గడ్డిని కాల్చవద్దు .. అధికారులు రైతులను ఈ విషయంలో చైతన్యం చేయాలన్నారు. వానాకాలం సాగులో పత్తి, కంది సాగు విస్తృతి పెంచాలి .. సన్నవడ్ల సాగును పెంచాలి .. ఇప్పటి నుండే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలన్నారు. ఉపాధిహామీ కింద అన్ని గ్రామాలలో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తికావాలన్నారు. ఏ కారణం చేత పూడికతీత పనులు చేపట్టకపోయినా సంబంధిత సర్పంచ్, కార్యదర్శులదే బాధ్యత అన్నారు. తూతూమంత్రంగా పనులుచేసినా, పనులు చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం అన్నారు.

- Advertisement -