అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌ను బలపర్చండి…

20
sathyavathi

సంక్షేమం, అభివృద్ధి జ‌ర‌గాలంటే కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌న్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొగిలిచర్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు ఇత‌ర రాష్ర్టాల్లో ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమ‌ల‌వుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. ఇంటింటికీ మంచినీరు అందించిన ఘ‌న‌త టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. త్వ‌ర‌లోనే కొత్త రేషన్ కార్డులు, 65 ఏళ్ల వయసు 57 ఏళ్లకు కుదించి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నాం అని వెల్లడించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు చెప్పే మాట‌లు విని మోస‌పోవ‌ద్దు అని సూచించారు.