పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు..

56
- Advertisement -

పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్ విత్తనాలు .. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకటే రకమైనవన్నారు. ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రైవేట్ కంపెనీలేనని…ప్యాకెట్ ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 450 గ్రాములకు రూ 853/- అన్నారు.

పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందన్నారు. కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని…అటువంటి డీలర్ల లైసెన్స్ లు రద్దుకు వెనుకాడం అన్నారు. అవసరమైన దానికన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

Also Read:Whatsapp:స్క్రీన్ షేరింగ్ ఫీచర్

ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని అంచనా వేశామని.. మేరకు 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి .. మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశింశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Also Read:ఛాతీలో మంట వస్తోందా..?

- Advertisement -