గుడి గుడికో జమ్మి చెట్టు అద్భుత కార్యక్రమం: మల్లారెడ్డి

139
mp trs
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అదేవిధంగా తను దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ పెద్ద చెరువు దగ్గర జమ్మి చెట్లను మంత్రి మల్లారెడ్డి గారితో కలిసి జమ్మి మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వార ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటడం జరుగుతుంది అని తెలిపారు.దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.

దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -