నిర్మాత మహేష్ కొనేరు మృతి…

21
mahesh

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నిర్మాత మహేష్ కొనేరు గుండెపోటుతో మృతిచెందారు. వైజాగ్‌లోని ఆయన స్వస్థలంలో మృతిచెందగా ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో పీఆర్వోగా పనిచేసిన మహేష్ తర్వాత నిర్మాతగా మారారు. జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలకు రెగ్యులర్ గా పీఆర్వోగా పని చేశారు. బాహుబలి’ సినిమాకు కూడా పీఆర్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో కొత్తగా బేనర్ మొదలు పెట్టి పలు సినిమాలు తీశారు మహేష్.