నడ్డా అబద్దాల అడ్డా..కేరాఫ్ ఎర్రగడ్డ

135
ktr
- Advertisement -

బీజేపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. నడ్డా అబద్ధాల అడ్డా కేరాఫ్ ఎర్రగడ్డ అని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదని మండిపడ్డారు. నడ్డా మాట్లాడిన మాటలు మతిస్థిమితం లేని వ్యక్తి మాట్లాడిన మాటల్లా ఉన్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిగ్గులేని మాటలు జేపీ నడ్డా మాట్లాడారు .తెలంగాణ లో ప్రభుత్వం పై ముందు రైతులను…ఇప్పడు ఉద్యోగులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 2022 కల్లా ఎన్నో చేస్తాం అన్నారు మోడీ కానీ ఏం చేయలేదు. ఇవన్నీ జుమ్లా అంటే…మా మీద హమ్లా. 5 లక్షల జాబ్స్ కేంద్రంలో ఉన్నాయి… వాటిని భర్తీ చేయరు. కానీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాలని దొంగ దీక్షలు చేస్తారని విమర్శించారు.

బీజేపీ అంటే భక్వాస్..జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం అని తెలిపారు. నరేంద్ర మోదీ రైతు విరోధి…. ప్రధాన మోడీని పంజాబ్ లో రైతులు అడ్డుకున్నారు. దేశచరిత్రలో ఏ ప్రధాన మంత్రికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కాలేదన్నారు. మేకిన్ ఇండియా అని…మేడిన్ చైనా విగ్రహాలు మేము … మీలా మేం తెచ్చిపెట్టలేదని మండిపడ్డారు. చీకట్లో గాడ్సే ను…బయట గాంధీని మొక్కుతారు…బిజెపి నేతలను గాంధీ క్షమిస్తాడా? అని ప్రశ్నించారు.

- Advertisement -