బండి పోతే బండి వస్తుంది..గుండుపోతే గుండు వస్తుందా: కేటీఆర్

15
ktr it

బీజేపీ నేతలు జేపీ నడ్డా, బండి సంజయ్‌లపై ద్వజమెత్తారు మంత్రి కేటీఆర్. అవినీతి గురించి నడ్డా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ తన గుండు తానే పగుల గొట్టుకుంటున్నాడు…బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ లో ఏం కొంపలు మునిగాయని నడ్డా హైద్రాబాద్ వచ్చాడు?…బీజేపీ ఎర్రగడ్డ మాటలు, ఎర్రగడ్డ చేతలు ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు.

మిషన్ భగీరథ గొప్పదని చెప్పిన మంత్రి షేకావత్ కు మెంటలా.. నీళ్లు రాలేవని చెప్పిన నడ్డా కు మెంటలా ప్రజలు ఆలోచించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరగలేదని సన్నాసి రేవంత్ అడిగితే కేంద్రమే పార్లమెంటు లో జవాబిచ్చిందన్నారు. ఉద్యోగులకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ ని నమ్ముతారని ప్రశ్నించారు. మార్కెట్ లో బీజేపీ కి భయపడే వారు ఎవరైనా ఉండొచ్చు…మేము కచ్చితంగా బీజేపీ వెంట పడుతూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం
అన్నారు.

కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన అన్నారు. కేసీఆర్ నిజం ఎటిఎం యే.. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్ అన్నారు. .దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పనికొస్తున్నాయన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.