హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్

11
- Advertisement -

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ విచారణను న్యాయస్థానం అనుమతించింది. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో న్యాయస్థాన్ని ఆశ్రయించారు.

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్‌కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 45కోట్ల 71 లక్షలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Also Read:TTD: ప్రయాగ్ రాజ్‌కు శ్రీవారి కళ్యాణ రథం

- Advertisement -