కరోనా కొత్త మార్గదర్శకాలు జారీ..

24
guidelines

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకి మైండ్ సిస్టంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకిన వ్యక్తి మూడు రోజుల వరకు జ్వరము లేదా జలుబు, దగ్గు లేకుంటే ఏడు రోజులు ఐసోలేషన్ లో ఉండాలని మార్గదర్శకాల్లో సూచించింది.

కరోనా సోకిన బాధితులు తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని తెలిపింది. ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు వెంటిలేషన్ బాగా ఉన్నా రూమ్ లో ఉండాలని సూచించింది. కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలని….ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలని తెలిపింది. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలని తెలిపింది. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ను ఉపయోగించాలని వెల్లడించింది.

బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని తెలిపింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలని సూచించింది. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలని….శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలని సూచించింది. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదు. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలని తెలిపింది. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదని వెల్లడించింది కేంద్రం.