గ్యాస్ ధరల పెంపు..మంచిరోజులోచ్చాయి!: కేటీఆర్ సెటైర్

84
- Advertisement -

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్….మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ లిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు అని పేర్కొన్నారు.

ఇలా ఉండగా 14 కేజీల సిలిండర్‌పై కేంద్రం రూ.50 వడ్డించింది. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1053కు పెరిగింది.

- Advertisement -