నగరంలోని చెరువుల అభివృద్ధికి చర్యలు- మంత్రి కేటీఆర్

149
- Advertisement -

హైదరాబాద్ మహానగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు పరిరక్షించడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ కమిషనర్‌ను జీహెచ్ఎంసీలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో మంత్రి కే. తారకరామారావు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. గత కొంత కాలంగా నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి మరియు పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూ వస్తున్నదని తెలిపిన మంత్రి కేటీఆర్, ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ను నియమించడం ద్వారా ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు మరియు ఇతర జల వనరులు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్ కి అప్పగిస్తామని తెలిపారు.

సివరేజ్ మేనేజ్మెంట్ తో పాటు ఎస్ టి పి ల నిర్మాణ కార్యక్రమాలు, శుద్ధి చేసిన నీటిని డైవర్ట్ చేయడం, చెరువుల ఎఫ్ టి ఎల్ నిర్ధారణ, సాగునీటి వనరుల పరిరక్షణ, చెరువుల సుందరీకరణ, చెరువు కట్టల బలోపేతం, చెరువుల పైన గ్రీన్ కవర్ పెంచడం వంటి పలు బాధ్యతలను ఈ స్పెషల్ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో పని చేస్తుందని,  సాగునీటి శాఖ ,రెవెన్యూ శాఖ, మునిసిపల్ శాఖ ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఇతర అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకొని ఈ కమిషనర్ పని చేయాల్సి ఉంటుందన్నారు.

దీంతోపాటు జిహెచ్ఎంసి లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్  ఈ కమిషనర్ కింద పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు సుందరమైన కాలుష్య రహిత ఇతర జలవనరులను అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఈ దిశగా ఈ ప్రత్యేక కమీషనర్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా తమ ప్రయత్నం మరింత వేగవంతం అవుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఇప్పటిదాకా చేపట్టిన చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ, పరిరక్షణ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణకు అత్యంత కీలకం అయిన నాలాలు అభివృద్ధి, ఇందుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాల అభివృద్ధికి సంబంధించి ఎస్ ఎన్ డి పి కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి చేపట్టిన పలు ఇతర కార్యక్రమాలను కూడా మంత్రి సమీక్షించారు. నగరంలో చేపడుతున్న ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్ల విస్తరణ, మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్, హెచ్ ఆర్ డి సి ఎల్ వంటి సంస్థలు చేపట్టిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

- Advertisement -