పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష..

189
ktr
- Advertisement -

ప్రస్తుతం ఎదుర్కోంటున్న కోవిడ్ 19 సంక్షోభం తర్వతా యధావిధిగా రాష్ర్టంలోని పారిశ్రామిక రంగ కార్యకలాపాలు కోనసాగేలా అవసరం అయిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖామంత్రి కె.తారక రామారావు ఈ రోజు పరిశ్రమల శాఖాధికారులను అదేశించారు. కోవిడ్ సంక్షోభం క్రమంగా తొలగిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి, భవిష్యత్తులో పరిశ్రమల్లోని పని స్ధితిగతులు మాత్రం మారతాయన్నారు. ప్రస్తుతం వైరస్ కట్టడికోసం చేపట్టిన సామాజిక దూరం, వ్యక్తిగత హైజీన్( సబ్బులు, సానిటైజర్ల వినియోగం) కొనసాగుతుందని, దీంతోపాటు పని ప్రదేశాల్లో కొన్ని మార్పులు చేసుకుని పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ktr meeting

దీంతోపాటు పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి మరింత నమ్మకం కలిగించేలా పరిశ్రమలు వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్ధితుల వలన కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, వ్యాపార వాణిజ్యాలు పూర్వస్ధాయిలో జరిగేలా ఇప్పటి నుంచే అయా వర్గాలతో సంభాషించాలని పరిశ్రమలు, ఐటి శాఖాదికారులను అదేశించారు. ఈరోజు బేగంపేటలోని టి ఫైబర్ కార్యాలయంలో మంత్రి, ఐటి, పరిశ్రమల శాఖాలో పనిచేస్తున్న వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం అయ్యారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులును నూతన ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న మంత్రి కెటిఆర్, వీటిని అందుకునేందుకు తెలంగాణ సిద్దంగా ఉండాలన్నారు. ఈదిశగా పరిశ్రమల శాఖ పని చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న కంపెనీలతోపాటు నూతన పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖతోపాటు ఇతరశాఖాలతో సమన్వయం చేసుకూంటూ ముందుకు పోవాలన్నారు. దీంతోపాటు ప్రస్తుత సంక్షోభం వలన ఏఏ రంగాల్లో ఏలాంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయో అధ్యయనం చేసి, వాటి సహాయాకారిగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన విభాగాల వారీగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గోన్నారు.

- Advertisement -