- Advertisement -
అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నామన్నారు మంత్రి కేటీఆర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….. అందరికీ సమాన హక్కులు ఉండాలని బాబాసాహెబ్ చెప్పారని అన్నారు. బోధించు, సమీకరించూ, పోరాడు అని చెప్పారని, ఆయన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు.
హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఈరోజే ఒప్పందం జరిగిందన్నారు. త్వరలోనే విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు.
- Advertisement -