కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్..

40
Harish rao

సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో ఘనంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్కిల్ లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్  విగ్రహంకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు….కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ …డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందన్నారు.

సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది …..చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నాం అన్నారు. ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ లో దళిత్ ఎంపవర్మెంట్ కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు చేసుకున్నాం….డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా తీరిదిద్దుకుంటున్నాం అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు…