చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు- మంత్రి కేటీఆర్‌

259
ktr
- Advertisement -

నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు వర్గాల మధ్య మ‌రోసారి గొడ‌వ చెల‌రేగి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డ పోలీసులు భారీగా మోహ‌రించి, ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సహించదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమాజ పురోగతిలో శాంతి, సామరస్యం కీలకమని చెప్పారు. భైంసాలో హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈమేరకు హోంమంత్రి మహమూద్‌ అలి, డీజీపీ మహేందర్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని, ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసే వారి ఉచ్చులో ప‌డొద్ద‌ని భైంసా ప్ర‌జ‌ల‌ను కేటీఆర్ కోరారు. శాంతి, భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -