ప‌రిశ్ర‌మ‌లు రావాలి..ఉపాధి పెర‌గాలి: కేటీఆర్

128
- Advertisement -

తెలంగాణ‌కు ప‌రిశ్ర‌మ‌లు రావాలి…ఉపాధి పెర‌గాల‌న్నారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్…అభివృద్ధిలో దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల‌న్నారు.

వెమ్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.దేశ రక్షణ రంగంలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని చెప్పారు. వెమ్‌ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఢిఫెన్స్‌ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు తరలించారని విమర్శించారు.

- Advertisement -