మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంః మంత్రి కేటీఆర్

199
ktr

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలపై చర్చించారు.

టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు కేటీఆర్. ఇప్పటికే టీఆర్ఎస్ 60లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. .

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలి. త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తమన్నారు. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.