రజనీకాంత్ “దర్బార్” కొత్త లుక్

175
darbar

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఈమూవీలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

తాజాగా రజనీకాంత్ లుక్ ను విడుదల చేశారు. రజనీ ఆరు పదుల వయస్సులోనూ కండలు చూపిస్తున్న తాజా పోస్టర్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇందులో ర‌జ‌నీ పోలీసు అధికారిగా, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈమూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు. దర్బార్ సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. పేట మూవీ తర్వాత రజనీకాంత్ చేస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ వయస్సులో కూడా రజనీకాంత్ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తు అభిమనులను అలరిస్తున్నారు.