సిరిసిల్లలో ZPHS ‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

337
ktr
- Advertisement -

సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమైయ్యాయి. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్‌లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ఈ పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌ను మించి అత్యంత అద్భుతంగా నిర్మించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారంతో సుమారు రూ.3 కోట్లతో ఈ పాఠ‌శాల‌ను నిర్మించారు. 1960లో ప్రారంభమైన ఈ పాఠశాల‌లో ప్ర‌స్తుతం 600 మంది విద్యార్థులు విద్య‌న‌భ్య‌సిస్తున్నారు.

కాగా, పాత భవనాలను కూల్చి మొత్తం 33 రూములతో సుమారు వెయ్యి మంది విద్యనభ్యసించేలా అత్యాధునిక వ‌స‌తుల‌తో నూతన భవనాన్ని నిర్మించారు. పాఠ‌శాల‌లో రూ.30 లక్షలతో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చుండి భోజనం చేసేలా డైనింగ్‌ హాల్‌, అత్యాధునిక గ్రంథాయలం, సురక్షిత తాగు నీరు, 50 కంప్యూటర్లతో డిజిటల్‌ ల్యాబ్‌, అధునాతనమైన సైన్స్‌, మాథ్స్‌ ల్యాబ్‌లు, మోడ్రన్‌ టాయిలెట్స్‌, 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -