2021-2022 బడ్జెట్‌ హైలైట్స్‌..

159
budget
- Advertisement -

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ లోక్‌సభలో 2021-2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ ప్రవేశపెట్టారు. ఆమె ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌ను చదివారు.

2021-2022 బడ్జెట్‌ కేటాయింపుల్లో ముఖ్యాంశాలు ఇవే..

-మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
-మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌
-గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
-స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
-ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్‌‌థ భారత్‌ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్‌
-రెగ్యులేటర్‌ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
-ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
-బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
-ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు
-1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
-రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
-రూ. 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
-వాహనరంగం వృద్ధి చర్యలు
-కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
-చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
-బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
-2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
-ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్‌‌ట కోస్‌‌ట సరకు రవాణా కారిడార్‌
-రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు
-2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
-దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కలు
-జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు
-ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
-2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం
-2025 నాటికి 4.8 శాతం టార్గెట్‌
-గోవా డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు
-మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు
-రీసెర్చ్ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం రూ. 5 వేల కోట్లు
-స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కు రూ. 3 వేల కోట్లు
-ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
-ఎలక్ట్రానిక్‌ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
-నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
-కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
-అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
-వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
-ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు
-ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు
-ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
-వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం
-కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌
-రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
-కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
-రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
-15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
-2021-22లో బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
-ఈ సంవత్సరమే ఎల్‌ఐసీ ఐపీవో

- Advertisement -