అక్షర యోధుడిని ఆదుకున్న కేటీఆర్‌..

362
Minister KTR Helps Poet Chaithanya Prakash
- Advertisement -

మంత్రి కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ముందు వరుసలో ఉండే కేటీఆర్‌.. ఈసారి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథారచయిత చైతన్య ప్రకాష్ కు అండగా నిలిచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ గత ఇరవై అయిదు సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు వ్రాస్తున్నారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని అందిస్తున చైతన్య ప్రకాష్ ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ తన తల్లి, సోదరి వద్ద కాలం వెళ్లదీస్తున్నాడు.

తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన చైతన్య ప్రకాష్ గతంలో మూడు పుస్తకాలు, వందలాది కవితలను ప్రచురించారు. మరుగున పడిపోతున్న తెలంగాణ పల్లె పదాలను, సామెతలను ఒక్కచోట చేర్చి ప్రకాష్ రాసిన ఆరువేల తెలంగాణ సామెత లతో కూడిన పుస్తకాన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆవిష్కరించింది.

Minister KTR Helps Poet Chaithanya Prakash

గత ఫిబ్రవరిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన చైతన్య ప్రకాశ్, కరీంనగర్ లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించారు. ఆయనకు పక్షవాతం సోకిందని దీర్ఘకాలంగా మందులు వాడాలని, అప్పుడే ఆయన సమస్య పరిష్కారమవుతుందని డాక్టర్లు తెలిపారు. ఇరవై అయిదు సంవత్సరాలుగా సాహిత్యసేవను మాత్రమే నమ్ముకున్న సత్యప్రకాష్ సంపాదించుకున్న దేమీ లేదు. ప్రస్తుతం సిరిసిల్లలోని తన మిత్రుడు ఇచ్చిన రేకుల షెడ్డు లోనే తల్లి, సోదరితో నివాసం ఉంటున్న ప్రకాష్ తన తల్లి ఎల్లమ్మ, సోదరి తోడుగా ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, సొంతంగా కాలకృత్యాలు సైతం తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చైతన్య ప్రకాష్‌ను ఆయన సాహితీ మిత్రులు పరామర్శించారు.

కాగా ప్రకాష్ పరిస్థితి మంత్రి కేటీ రామారావు దృష్టికి వచ్చింది. వెంటనే తన కార్యాలయ సిబ్బందికి ప్రకాష్ ను ఆదుకోవాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం చైతన్య ప్రకాష్ తో మాట్లాడి ఆయన చికిత్సకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. దీంతోపాటు తన కనీస అవసరాలు తీర్చుకునేందుకు 3 లక్షల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి మంత్రి మంజూరు చేయించారు. సోమవారం ఈ ఆర్థిక సహాయాన్ని చైతన్యప్రకాష్ కు మంత్రి కార్యాలయం అందించనుంది. అచేతనంగా పడి ఉన్న తన కొడుకుకు ఆర్థిక సాయం అందించిన మంత్రి కెటి రామారావుకు చైతన్య ప్రకాష్ తల్లి ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది. కష్టాల్లో ఉన్న సాహితీ కళాకారున్నిఆదుకున్న మంత్రి చొరవకు సాహితీలోకం ధన్యవాదాలు తెలుపుతోంది.

- Advertisement -