‘భరత్’ పై ‘జై’ ప్రశంసలు

247
NTR praise for Mahesh Babu’s Bharat Ane Nenu
- Advertisement -

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది. రెండు రోజులలోనే రూ.100 కోట్లు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా, తాజాగా ఈ చిత్రంపై జూ. ఎన్టీఆర్ స్పందించారు. సామాజిక బాధ్యతను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి తీయడం అంత తేలికైన విషయ కాదన్నారు. కొరటాల శివ ఈ రెండు అంశాలను అద్భుతంగా  బ్యాలెన్స్  చేశాడన్నారు.

NTR praise for Mahesh Babu’s Bharat Ane Nenu

ఇక ఈ మూవీలో మహేష్ అద్భుతంగా నటించారని, తనకు నా శుభాకాంక్షలు చెబుతున్నానన్నాడు. భరత్ అనే నేను ఎప్పటికీ చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతున్నానని ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా, కైరా అద్వాణి కథాయిక, దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు.

- Advertisement -